Fundraising 2011/Sengai Letter/te


ప్రకటన

edit
  • దయచేసి చదవండి :
    వికీపీడియా తోడ్పాటుదారు డా॥ శెంగై పోదువన్
    గారి నుండి నివేదన

శీర్షిక

edit

వికీపీడియా తోడ్పాటుదారు డా॥శెంగై పోదువన్ నుండి

నివేదన

edit

నేను 1936 లో ఒక పేద రైతుగా గ్రామీణ భారతదేశంలో పుట్టాను. ఈ రోజు నేను వికీపీడియాయే నా శ్వాసగా బ్రతుకుతున్నాను.

రాబోయే తరాలకు వికీపీడియా అందుబాటులో ఉండాలన్నది నా కోరిక. ఇది వికీపీడియా జాలగూడుకు అవసరమయిన సర్వర్లు, ఉద్యోగులు మరియు ఇతర అవసరాలను తీర్చేందుకు చేబట్టే వార్షిక చందా సేకరణ. తద్వారా వికీపీడియాను జాలంలో ఉచితంగా, ఎటువంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా అందించడానికి దోహద పడుతుంది. మీకు తోచినంతలో 100/-, 250/-, 500/- లేక మీరు ఇవ్వగలిగినంత మొత్తాన్ని అందించండి.

నా వయసుకి చేరుకున్నాక మీ జ్ఞానాన్ని మరియు అనుభవాలను మీరు ప్రపంచంతో పంచుకోవాలనుకుంటారు. నా జీవితంలో నేను ఒక ఉపాధ్యాయుడిగా, డాక్టరేట్ పట్టా సంపాదించి, ప్రభుత్వ ప్రచురణలకు 14 సంవత్సరాలు పని చేసి, ఐదుగురు కూతుళ్ళకు మరియు ఒక కొడుకుకు తండ్రిగా ఉన్నప్పటికీ నన్ను నేను ఒక నాగలి చేబట్టిన రైతుగానే అనుకుంటాను.

నా డాక్టరేట్ అధ్యయనంలో నేను భారతదేశ రాష్ట్రమయిన తమిళనాడులో ఆడబడే దేశీయ ఆటల గురించి రాసాను. బహుశా నా వ్యాసాల్లో ఒక్కటీ మీరు చూడకపోవచ్చు. కానీ వేల మంది చదువుతారు అన్న విషయం నన్నెంతో ఆనందభరితుడ్ని చేస్తుంది. మీరు ఏ విషాయానికి సంబంధించి తెలుసుకోవాలన్నా అది వికీపీడియాలో మీకు తప్పక దొరుకుతుంది, ఈ విషయమై నేను ఎంతో గర్వపడుతున్నాను.

2005 లో నేను మొదటి సారి గణనయంత్రాన్ని కొన్నపుడు, నా చేతుల వణుకు వలన కనీసం మౌస్ ని కూడా వాడలేకపోయేవాణ్ణి. కానీ 2009 లో నేను వికీపీడియాని కనుగొన్నాను. ఒక రోజు ప్రాచీన భారత కవులపై ఒక వ్యాసాన్ని రూపొందించాను. జాబితాలో ఒక 30 పేర్లను జోడించి పడుకున్నాను. మరుసటి రోజు ఉదయం నాకు అదే వ్యాసంలో 473 పేర్లు కనిపించాయి. ఇదే వికీపీడియా పనితీరు!

దయచేసి మా ఈ ప్రయత్నంలో వికీపీడియాకు తోడ్పడటం ద్వారా కానీ లేదా చందా ఇవ్వటం ద్వారా కానీ వికీపీడియాను ఉచితంగా అందుబాటులో ఉంచండి.

నెనరులతో,

డా॥ శెంగై పోదువన్

వికీపీడియా సంపాదకుడు